Tgpvwa Photo News

సిద్దిపేటలో ఘనంగా PPIN వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్మార్ట్ బిజినెస్ వర్క్‌షాప్

31, May 2026 58 Views
సిద్దిపేటలో ఘనంగా PPIN వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్మార్ట్ బిజినెస్ వర్క్‌షాప్

సిద్దిపేటలో ఘనంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్మార్ట్ బిజినెస్ వర్క్‌షాప్

300 మందికి పైగా ఫోటోగ్రాఫర్ల హాజరు – PPIN హెల్త్ కార్డ్ ద్వారా ఉచిత OP సేవలు అందించడం అభినందనీయమని కొనియాడిన ముఖ్య అతిథి మాజీ మంత్రి హరీశ్ రావు గారు 

70 మంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు అవార్డులు – బుక్క శ్రీనుకు PPIN జిల్లా చైర్మన్ బాధ్యతలు

సిద్దిపేటలో 30-05-2026న PPIN ఆధ్వర్యంలో ఎడిట్‌పాయింట్ రమేష్ మరియు అభిమన్యు నిర్వహించిన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్మార్ట్ బిజినెస్ వర్క్‌షాప్ ఘన విజయాన్ని సాధించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మందికి పైగా యువ ఫోటోగ్రాఫర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రోజంతా సాగిన ఈ వర్క్‌షాప్‌లో రా స్టూడియో అధినేత రఘురామ్ ప్రీ వెడ్డింగ్ ట్రెండ్స్, కంపోజిషన్స్ మరియు క్రియేటివ్ షూటింగ్ టెక్నిక్స్‌పై అవగాహన కల్పించారు. సోనీ టీమ్‌కు చెందిన ఫరూక్ సోనీ కెమెరాల తాజా సాంకేతికత, ఫీచర్లపై వివరించారు. KBK హాస్పిటల్ అధినేత డా. భరత్ కుమార్ అమెరికాలో ఫోటోగ్రఫీ అవకాశాలు, ఆరోగ్య పరిరక్షణ, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవసరమైన అంశాలపై మాట్లాడారు. అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొనే డేటా లాస్ సమస్యలు, సోషల్ మీడియా పోస్టింగ్‌లకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. HP ప్రింటర్స్ నుంచి విజయ్ ఫోటోగ్రఫీ వ్యాపారంలో ప్రింటింగ్ ప్రాముఖ్యత, HP ప్రింటర్ల ప్రత్యేకతలపై వివరించారు.

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ఫోటోగ్రఫీకి సమాజంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. AI వంటి కొత్త టెక్నాలజీలు వచ్చిన నేపథ్యంలో ప్రతి రంగం అప్‌డేట్ అవుతున్నట్లే ఫోటోగ్రాఫర్లు కూడా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఫోటోగ్రాఫర్లకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని, సిద్దిపేట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవనానికి సంబంధించిన మిగిలిన పనులు పూర్తి చేసేందుకు త్వరలో కలవాలని కోరారు. PPIN హెల్త్ కార్డ్ ద్వారా ఉచిత OP సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు.

ఎడిట్‌పాయింట్ రమేష్ మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు వ్యాపారంలో చేస్తున్న పొరపాట్లు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, డిజిటల్ టూల్స్ వినియోగం, AI యుగంలో వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేక బిజినెస్ క్లాస్ నిర్వహించినట్లు తెలిపారు. PPIN ఒక అసోసియేషన్ కాదని, ఫోటోగ్రాఫర్ల కోసం పనిచేస్తున్న ఒక బిజినెస్ నెట్‌వర్క్ అని స్పష్టం చేశారు. సభ్యులు వ్యాపారంలో ఎలా ఎదగాలి, కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి, డిజిటల్ యుగంలో ఎలా నిలదొక్కుకోవాలి అనే అంశాలపైనే PPIN దృష్టి సారిస్తోందన్నారు. వర్క్‌షాపులు, ఎక్స్‌పోలు, హెల్త్ కార్డులు, బిజినెస్ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా ఫోటోగ్రాఫర్లకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

PPINకు అసోసియేషన్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని, ఇప్పటికే ఉన్న సంఘాలతో కలిసి ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కోసం పనిచేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అయితే ఫోటోగ్రాఫర్ల ప్రయోజనాల కోసం అవసరం వస్తే ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉంటామని అన్నారు. ఫోటోగ్రాఫర్ల అభిమానాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకోవడమే తమ బలం అని, అవసరమైతే సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా కూడా తమకు ఉందని పేర్కొన్నారు. కానీ తమ ప్రాధాన్యత పదవులు కాదని, ఫోటోగ్రాఫర్ల అభివృద్ధేనని స్పష్టం చేశారు.

మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సిద్దిపేటలో తాను జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ప్రారంభమైన ఫోటోగ్రాఫర్స్ భవనం ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. ఫోటోగ్రాఫర్ల మధ్య ఐక్యత లోపించడం, సంఘ రాజకీయాలు, వర్గ విభేదాలే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కొందరు నాయకులు పదవుల రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ వర్గాలను ప్రోత్సహించడం మంచిది కాదన్నారు.

ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి కొందరు బాధ్యత గల నాయకులు హాజరు కాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి PPIN వంటి సంస్థలు ఫోటోగ్రాఫర్ల వద్దకే వచ్చి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వాటిని స్వాగతించి మరింత మంది లబ్ధి పొందేలా చూడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. భవన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి మాజీ మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించడం ఆనందదాయకమన్నారు. PPIN హెల్త్ కార్డులను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రతి ఫోటోగ్రాఫర్‌కు అందేలా కృషి చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసినా, గెలిచినా, ఓడినా ఫోటోగ్రాఫర్ల కోసం తమ సేవలు కొనసాగుతాయని చెప్పారు.

PPIN వ్యవస్థాపకుడు అభిమన్యు మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో వందలాది వర్క్‌షాపులు, సెమినార్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకు ఫోటోగ్రాఫర్లకు కొత్త టెక్నాలజీలు, డిజిటల్ టూల్స్, AI, మార్కెటింగ్ విధానాలను పరిచయం చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల ఆదాయం పెరగడం, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం, వృత్తిపరంగా ఎదగడం లక్ష్యంగా PPIN కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.

కొంతమంది PPINను రెండో సంఘంలా చిత్రీకరిస్తూ, ఫోటోగ్రాఫర్ల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అభిమన్యు ఆవేదన వ్యక్తం చేశారు. PPINను వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించవచ్చని, కానీ ఫోటోగ్రాఫర్లకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా చివరికి నష్టం ఫోటోగ్రాఫర్లకే జరుగుతుందని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు ఆగవని, ఫోటోగ్రాఫర్ల అభిమానం ఉన్నంతకాలం తమ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా బుక్క శ్రీనును మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా PPIN చైర్మన్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా నియామక పత్రం మరియు సర్టిఫికెట్ అందజేశారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్న్ ఆల్బమ్స్ సహకారంతో సిద్దిపేట జిల్లాలోని 70 మంది ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే వర్క్‌షాప్‌కు హాజరైన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేశారు. అవార్డుల ప్రదానం, సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

రాజా రాణి స్టూడియో మధ్యాహ్న భోజనాన్ని స్పాన్సర్ చేసింది. PPIN రాష్ట్ర ప్రతినిధులు జుక్లూర్ మధు, ఆర్న్ ఆల్బమ్స్ అధినేత అరుణ్ కుమార్, జిల్లా నాయకులు బుక్క శ్రీను, మురళి, శ్రీరాజ్, ప్రభుదాస్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ సతీష్ మరియు వారి బృందం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

కోసమెరుపు: ఇప్పటివరకు ఎక్స్‌పోలకు మాత్రమే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం చూశాం. అయితే ఈ వర్క్‌షాప్‌కు గజ్వేల్ నుంచి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో 45 మంది ఫోటోగ్రాఫర్లు హాజరుకావడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

Related Posts

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న  అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

<p>ఫోటో న్యూస్ : ఇండియా &nbsp;ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ మరియు అకాడమిక్...

04, Jan 2024 4
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

<p>తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా &nbsp;పెద్దపల్లి &nbsp;జిల్లాలో ఫోటో...

06, Feb 2024 5
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

<p>ఫోటో న్యూస్ :&nbsp;చైనా దేశం లోని షాంగైలో ఫిబ్రవరి 29, మార్చి 1,2 తేదిలలో ...

03, Mar 2024 19
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని  తమ్మినేని సీతారాంకి  వినతి పత్రం
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

<p>ఫోటో న్యూస్ ; &nbsp;ఇటీవలే దారుణ హత్యకి గురైన విశాఖ జిల్లాకి చెందిన ఫోటో గ...

13, Mar 2024 23
Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
close

Product Pricing Assistance Find product price details easily with Photo Parivar India

"Join Photo Parivar India Network (PPIN)—connect, grow, and access 360° professional support"

Expand your photography business with India’s trusted B2B network. Collaborate, grow, and get 360° support before, during, and after every event.

Become a Member arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by PPIN (Fototech & Editpoint)

Loading...